దేవతలే గురువులు
శిష్యుడు : చెప్పాలని ఉంది
గురువు : ఆ.........?
శిష్యుడు : చెప్పాలని ఉంది
గురువు : ఊ ........
శిష్యుడు : దేవతలే దిగివచ్చి గురువులుగా
వెలసిన కథ చెప్పాలని ఉంది
శిష్యుడు: పల్లెటూరి పిల్లలకు చదువుచెప్పి
వెన్నుతట్టి !! 2 !!
మనిషిగ తీరిచిదిద్దిన మరువరాని గురువుల కథ చెప్పాలని ఉంది
శిష్యుడు : కోరగనే చదువుజెప్పి, కొండంత వెలుగునిచ్చి !! 2 !!
మట్టిని మణిగా జేసిన మమతెరిగిన గురువుల కథ చెప్పాలని ఉంది
శిష్యుడు : అంతటి వారికి నేనెంత సేవ చేసినా ..... !! 2 !!
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా యెలా తీరునో
గురువు : మా మాటలనాలకించి ముందు మీరు పాటిస్తే
మీరెరిగిన చదువులను పదిమందికి చాటిస్తే
మీ మదిలో మేమంతా చిరకాలము నిలిచెదము
ఆ......... ఆ ........ ఆ......
రచన:
బేతపూడి మధు
(ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి దేవతయే దిగివచ్చి అను పాటకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను
రాసిన పేరడీ)