శ్రీరామ జయరామ - భజన పాట


  నా పేరు బేతపూడి మధు.  నేను లలిత కవి బిరుదాంకితులైన శ్రీ బేతపూడి రాజశేఖర రావు గారి కుమారుడను. మా నాన్నగారి  ప్రోత్సాహము, ఆశీస్సులతో నేను  వ్రాసిన పాట.నేను  ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టిన ఊరు చాపార్లపల్లిలోని రామాలయం సందర్శించిన సందర్భంగా....


పల్లవి:         శ్రీరామ జయరామ శ్రీరంగధామ

కోరికల్ దీర్చవా కోదండరామ  !!2!!

చరణం: చాపార్లపల్లిలో జానకీదేవితో

కొలువైన ఓ రామ కోదండ రామ  !!శ్రీరామ!!

చరణం:  నీ నామ జపమును నిశ్చలముగ జేయ 

కోవెలకు వచ్చితిమి కోదండరామ !!శ్రీరామ!!

చరణం: మాపైన దయజూపి మా బాధలను బాపి

కురిపించవా ప్రేమ కోదండరామ  !!శ్రీరామ!!

చరణం: కలిగినది దెచ్చితిమి కాదనకగొనుమయ్య

కోపగించకుమయ్య కోదండరామ  !!శ్రీరామ!!

చరణం: మావూరి జనులెల్ల మనసారకొలిచేరు

కూర్మితో రక్షించు కోదండరామ  !!శ్రీరామ!!


Post a Comment

Previous Post Next Post