బేతపూడి సాహితీ సుధ
సందర్శకులకు స్వాగతం
సూర్యుని చుట్టూ భూమి, తదితర గ్రహలు నిరంతరం నిర్విరామంగా పరిభ్రమిస్తున్నట్లుగానే, నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా మానవుడు తన మనుగడ కొరకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తూనే ఉన్నాడు. ఏకాస్త విరామం దొరికిన తన మానసికోల్లాసానికి దానిని వెచ్చిస్తూ ఊరడిల్లుచూ తదుపరి కర్తవ్యకార్య నిర్వహణకు కావలసిన శక్తిని తిరిగి పొందుచున్నాడు. ఇది అనాదిగా మానవ జీవన విధానంలో భాగమే అయినా నేటి తరపు అత్యాధునిక పద్ధతులు, పరికరాల ద్వారా ఈ ఆనందానుభూతిని పొందుటకు ఇచ్చగిస్తున్నాడు. ఐతే ఈ రీతిగా ఉల్లాసాన్నిచ్చేవి కళలు మాత్రమే. ఈ కళలలో సంగీతం, సాహిత్యాలది ప్రథమ స్థానం. ఎందుకంటే ఇవి కేవలం వినుట ద్వారానే ఆనందానుభూతిని ఇచ్చేవి గనుక.
నేటి తరపు సగటు మనిషి తన వెబ్ సైట్ ద్వారా ఉన్నచోటునుంచే ఈ సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు. సాహిత్యం చదవటం, వినటం ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంప్రదాయక, తదితర సామాజిక అంశాలు తెలిసికొని ఆనందించడమే గాక తన భావాలను కవిత్వీకరించగల స్థాయికి చేరుకోగలుగుచున్నాడు.
అందుకొరకే ఈ బేతపూడి సాహితీ సుధ ను రూపొందించటం జరిగింది.
ఈ వెబ్ లో ఆంధ్రసాహిత్యంలో సంప్రదాయ కవిత్వంగా అలరారుచున్న పద్య, గేయ, వచన, వ్యాసాలు తదితరాలు పొందుపరచబడినవి. కనుక సోదరులారా! ఈ వెబ్ సైట్ ను సందర్శించుట ద్వారా మీ మానసిక గ్లాని నుండి ఉపశమనం పొంది, ఉత్తేజితులు కాగలరని ఆశిస్తున్నాను.

బేతపూడి సాహితి సుధను సృజించిన మీకు కృతజ్ఞతలు
ReplyDelete