Showing posts from October, 2025
లలితాసందర్శనము పద్మశ్రీ శ్రీ ఆశావాది ప్రకాశరావు గారు వ్రాసిన పార్వతీశతకం అను పద్యకావ్యానికి విశ్లేషణాత్మక వ్యాఖ్యానం ఈ లలితా సందర్శనం . చదివి తరించండి.
అంతర్మథనము సందర్భోచిత సరళ సుందర పదగుంభన చతురత, జలధారాసదృశ మనోహర శైలీనిర్మాణ నిపుణత ఈ అంతర్మథనము అనే ఖండకావ్యంలోని ప్రతి అంశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చదవండి.
అమరావతి అమరావతీ క్షేత్ర ప్రాశస్త్యము, కృష్ణాతీర ప్రాంత ప్రభావం, సంస్కృత శ్లోకాలకు పద్యానువాదము, వేదబోధ వంటి 24 కవితాకళాఖండాలను పొందుపరచిన ఖండకావ్యం అమరావతి. సాహితీపిపాసకుల ఆనందం కోసం అందుకోండి.
రసమయి దూరదర్శన్ మరియు ఆకాశవాణిలలో అవధానులు, పండితులు అలాగే విద్వాన్ దాదాన చిన్నయ్యగారు, డా|| ఆశావాది ప్రకాశరావుగారు మరియు స్నేహితులు సంధించిన సమస్యలను హృద్యంగా పూరించిన పద్యరత్నమాల రసమయి.
చంద్రమౌళి శతకము మొదటి భాగము చంద్రమౌళి శతకము రెండవ భాగము ద్వాదశ జ్యోతిర్లింగోద్భవ చరితం, సృష్టి ఆవిర్భావం,దక్ష యజ్ఞం,హాలాహల భక్షణం, శివ మహిమా విశేషభరితం ఈ చంద్రమౌళి శతకం.